Nagarjuna: 'బంగార్రాజు' నుంచి మ్యూజికల్ పోస్టర్ రిలీజ్!

Bangarraju Movie Update

  • 'బంగార్రాజు'గా నాగార్జున 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • ప్రత్యేక ఆకర్షణగా ఫరియా 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్  

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. పిల్ల బంగార్రాజుగా నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మ్యూజికల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగ్గారాజు .. మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు' అంటూ ఈ పాట సాగుతోంది. 'ది పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్' పేరుతో ఈ పాట టీజర్ ను ఈ నెల 17వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.

'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లాపై ఈ పాటను చిత్రీకరించారనేది పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర కూడా చాలా ముఖ్యమైనదనే విషయం స్పష్టమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News