UK: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

UK witness first Omicron death

  • ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం
  • బ్రిటన్ లోనూ పలు కేసులు
  • ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించాడన్న ప్రధాని బోరిస్ జాన్సన్
  • ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదైంది. యూకేలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారిక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ కారణంగా ఆసుపత్రిపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు ప్రజలు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవడమొక్కటే అత్యుత్తమ మార్గం అని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు.

అటు, బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ స్పందిస్తూ, ఒమిక్రాన్ పాజిటివ్ గా వచ్చిన వారు 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News