Nagarjuna: వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ప్రకటించిన నాగార్జున

Actor Nagarjuna adopts 1000 Ac reserve forest
  • బిగ్ బాస్ షోలో ఆసక్తికర ప్రకటన చేసిన నాగార్జున
  • అతిథిగా వచ్చిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్
  • కంటెస్టెంట్లు అందరూ మూడు మొక్కలు నాటాలని పిలుపు
  • అభిమానులు, ప్రేక్షకులందరూ మొక్కలు నాటాలని విన్నపం
వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రముఖ సినీ నటుడు నాగార్జున ప్రకటించారు. తాను హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో 'బిగ్ బాస్' కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నిన్నటి ఎపిసోడ్ కు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున ఈ ప్రకటన చేశారు.

అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ మూడు వారాల్లో మూడు మొక్కలు నాటాలని కంటెస్టెంట్స్ కు సూచించారు. అలాగే తన అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులందరూ మొక్కలు నాటాలని కోరారు. అంతేకాదు సంతోష్ కుమార్ ఇచ్చిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంతోష్ కుమార్ చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రశంసిస్తున్నానని చెప్పారు. సంతోష్ కుమార్ స్ఫూర్తిని తాను కూడా కొనసాగిస్తానని అన్నారు.
Nagarjuna
Tollywood
Plants Planting
Bigg Boss
Reserve forest

More Telugu News