Andhra Pradesh: ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు.. బ్రిటన్ నుంచి తిరుపతికి వచ్చిన వ్యక్తికి నిర్ధారణ?

One More Omicron Case In AP

  • జీనోమ్ టెస్ట్ లో తేలిందంటున్న వైద్యులు
  • విజయనగరం జిల్లా వ్యక్తి కాంటాక్ట్ లకు టెస్టులు
  • అందరికీ నెగెటివ్ వచ్చిందన్న డీఎంహెచ్ వో

ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయనగరంలో ఒక కేసు బయటపడగా.. తిరుపతిలోనూ మరో వ్యక్తి దాని బారిన పడినట్టు సమాచారం. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలున్నాయని చెబుతున్నారు. ఇవాళ 34 ఏళ్ల ఆ వ్యక్తికి జీనోమ్ టెస్ట్ చేయగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని వైద్యులు చెప్పారు. ఈ నెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చారని తెలిపారు.

ఏపీలోకి కూడా ఒమిక్రాన్ ఎంటరైన విషయం తెలిసిందే. విజయనగరంలో ఓ కేసు నమోదైందని అధికారులు నిర్ధారించారు. దానిపై విజయనగరం జిల్లా డీఎంహెచ్ వో డాక్టర్ రమణకుమారి వివరణ ఇచ్చారు. ఈ నెల 5న ఆ వ్యక్తి ఐర్లాండ్ నుంచి వచ్చాడని, విశాఖలోని తన అత్తారింటికి వెళ్లాడని తెలిపారు. అతడికి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలిందని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 6న హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపామని చెప్పారు.

ఒమిక్రాన్ గా తేలిందని చెప్పారు. నిన్న మరోసారి టెస్ట్ చేయగా నెగెటివ్ గా రిపోర్ట్ వచ్చిందన్నారు. కాగా, బాధితుడిని 40 మంది కలిశారని, వారందరికీ టెస్టులు చేశామని వివరించారు. వారికి నెగెటివ్ వచ్చిందన్నారు. అతడు ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ఉన్న వంద మందికీ టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. 

  • Loading...

More Telugu News