Simbu: తీవ్ర ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిన తమిళ హీరో శింబు

Hero Simbu hospitalized with severe infection

  • నిన్నటి నుంచి శింబుకు అధిక జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్
  • చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • కరోనా కాదని వైద్యులు చెప్పారంటున్న సన్నిహితులు
  • ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న శింబు

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోలీవుడ్ హీరో శింబు చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శింబు తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. నిన్నటి నుంచి అధిక జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండడంతో ఆసుపత్రిలో చేరాడు.

కాగా, శింబుకు కరోనా కాదని, ఇతర ఇన్ఫెక్షన్ అని డాక్టర్లు చెప్పారని సన్నిహితులు వెల్లడించారు. శింబు ఆసుపత్రిపాలవడంపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. శింబు ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'వెందు తనిందదు కాడు' చిత్రంలో నటిస్తున్నాడు. గత కొన్నివారాలుగా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Simbu
Hospital
Infection
Chennai
Kollywood
  • Loading...

More Telugu News