Ramcharan: ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఎన్టీఆర్‌ను గిల్లిన రామ్ చ‌ర‌ణ్.. ఉలిక్కిప‌డ్డ తార‌క్.. వీడియో ఇదిగో

 Ram Charan pinched Jr NTR

  • ప్రెస్‌మీట్ ముగిశాక ఘ‌ట‌న‌
  • ఫొటో దిగుతోన్న స‌మ‌యంలో గిల్లిన‌ చెర్రీ
  • ఇదేం గిల్లుడు బ్రో అంటూ నెటిజ‌న్ల కామెంట్లు

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి యంగ్ హీరోల‌తో క‌లిసి దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. షూటింగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ స‌ర‌దాగా గొడ‌వ ప‌డుతుంటార‌ని ఇప్ప‌టికే రాజ‌మౌళి చెప్పారు.

ఈ ప్రెస్‌మీట్ ముగిశాక మ‌ళ్లీ అటువంటి చిలిపి ప‌నులే క‌న‌ప‌డ్డాయి. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ క‌లిసి ఫొటో దిగుతోన్న స‌మ‌యంలో ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఎన్టీఆర్‌ను రామ్ చ‌ర‌ణ్ గిల్లాడు. దీంతో ఎన్టీఆర్ ఉలిక్కిప‌డి దూరం జ‌రిగాడు. రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు ఏమీ తెలియ‌ద‌న్న‌ట్లు చూశాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. 'ఇదేం గిల్లుడు బ్రో' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్‌ను ప్ర‌భాస్ కూడా ఇలాగే గిల్లాడంటూ అప్ప‌టి వీడియోనూ కొంద‌రు పోస్ట్ చేస్తున్నారు.      


          

  • Loading...

More Telugu News