Andhra Pradesh: ఏపీకి 10 రోజుల్లో విదేశాల నుంచి 12,500 మంది రాక.. ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్న 3,500 మంది!

12500 persons came to AP from foreign in last 10 days

  • రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ భయాలు
  • విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్
  • అందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్న అధికారులు

ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు మన దేశంలో సరికొత్త భయాలకు కారణమవుతోంది. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయనుకున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పటికే ఎన్నో దేశాలకు వ్యాప్తి చెందింది. మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలను నిర్వహిస్తున్నారు.

మరోవైపు డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఏపీకి 12,500 మంది వచ్చారు. వీరిలో 1,700 మంది విశాఖ జిల్లాకు చెందిన వారే ఉన్నట్టు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 వేల మంది అడ్రస్ లను అధికారులు గుర్తించారు. మిగిలిన 3500 మందిని సంప్రదించడానికి అధికారులు ప్రయత్నించగా... వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అయితే, వీరంతా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో వారి వివరాలను సేకరించడం అధికారులకు కష్టమవుతోంది. మరోవైపు వీరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో... వారి రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా కొవిడ్ పరీక్షలను చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News