Allu Arjun: 'పుష్ప' టీమ్ కి కానుకలు ఇచ్చిన బన్నీ!

Pushpa movie update

  • సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 17వ తేదీన విడుదల
  • డైరెక్షన్ శాఖలోని వారికి గోల్డ్ రింగ్స్

సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

షూటింగు సమయంలోనే ఈ సినిమా కరోనా పరిస్థితులను ఎదుర్కొంది. ఆ తరువాత భారీ వర్షాల వంటి అవాంతరాలను చూసింది. పైగా ఈ సినిమా కథ నేపథ్యం కారణంగా అడవిలోనే ఎక్కువగా షూటింగు చేయవలసి వచ్చింది. అందువలన  ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారట.

అందువలన బన్నీ ఫస్టు పార్టు విడుదలకి దగ్గరవుతున్న వేళ, వాళ్లను అభినందించాడట. అంతేకాకుండా డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేసినవారికి గోల్డ్ రింగ్స్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇతర సిబ్బందికి నగదు రూపంలో ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఇలా తమ సినిమా టీమ్ కి గిఫ్టులు అందించడమనేది తమిళంలో అజిత్ .. విజయ్ ఎక్కువగా చేస్తుంటారు.

Allu Arjun
Rashmika Mandanna
Jagapathi Babu
Pushpa Movie
  • Loading...

More Telugu News