Sonia Gandhi: ప్రభుత్వ సంస్థలను మూతపడేలా చేస్తున్నారు: సోనియా గాంధీ
- దేశ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోంది
- 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడం బాధాకరం
- బీజేపీ పాలనలో అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి
దేశ ఆస్తులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తున్నారని అన్నారు. రైతుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది పొడవున కొనసాగిన ఉద్యమంలో 700 మంది రైతులు అమరులయ్యారని... వారికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించాలని చెప్పారు.
రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరమని... ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీలకు అందరూ మద్దతుగా ఉండాలని చెప్పారు. బీజేపీ పాలనలో అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని... సామాన్యులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.