Shimbu: 'ది లూప్' రీమేక్ లో సాయితేజ్!

The Loop Movie Update

  • శింబూ తాజా చిత్రంగా 'మానాడు'
  • భారీ వసూళ్లను రాబడుతున్న సినిమా
  • ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య
  • తెలుగు రిలీజ్ లేనట్టే

తమిళ హీరో శింబూ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గతంలో తాను చేజార్చుకున్న ప్లేస్ కి చేరుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కథాకథనాల్లోను .. పాత్రల పరంగాను కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'మానాడు' (మహాసభ). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.  

తమిళంలో భారీ బడ్జెత్ తో నిర్మించిన ఈ సినిమాను, అక్కడ క్రితం నెల 25వ తేదీన రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజున  తెలుగులో 'ది లూప్' టైటిల్ తో విడుదల చేయాలనుకున్నారు. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అక్కడ ఆ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది.

తెలుగులో శింబూకి అంతగా మార్కెట్ లేదు. ఆయన సినిమాలు ఇక్కడ అంతగా ఆడింది లేదు. అందువలన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో తెలుగు రిలీజ్ ను ఆపారట. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ఒక బడా నిర్మాత ట్రై చేస్తున్నాడనీ, ఆయన ఈ సినిమాను సాయితేజ్ తో నిర్మించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

Shimbu
S J Surya
Saitej
The Loop Movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News