TTD: తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు.. రాకపోకలు నిలిపివేత
- రెండో కనుమ దారి చివరి మలుపు వద్ద రోడ్డు ధ్వంసం
- కోతకు గురైన రోడ్డు
- మరమ్మతులు ప్రారంభించిన టీటీడీ అధికారులు
తిరుమల ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసమైంది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. కొండపై నుంచి భారీ బండరాయి కింద పడడంతో తిరుమల రెండో కనుమ దారి చివరి మలుపు వద్ద రోడ్డు ధ్వంసమైంది. రోడ్డంతా రాళ్లతో నిండిపోవడం, కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలిపివేశారు.
రోడ్డుపై పడిన రాళ్లను తొలగించి దారిని పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. రెండో ఘాట్‌రోడ్డులో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పుడు కూడా రోడ్డును మూసివేశారు.