Trainee IAS: రేప్ కేసులో ట్రైనీ ఐఏఎస్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
- రేప్ కేసులో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ మృగేందర్ లాల్
- కూకట్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
- 15 రోజుల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ట్రైనీ ఐఏఎస్ అధికారి మృంగేందర్ లాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్ప్యాప్తుకు ఆయన సహకరించాలని, నపుంసకత్వ పరీక్షకు సహకరించాలని ఆదేశించింది. దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దు చేయాలని దర్యాప్తు అధికారి హైకోర్టును కోరవచ్చని తెలిపింది.
కేసు వివరాల్లోకి వెళ్తే... 2019 డిసెంబర్ 25న మృగేందర్ లాల్ బానోత్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ ఓ బాధితురాలు హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మృగేందర్ లాల్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మృగేందర్ ను అరెస్ట్ చేస్తే అధికారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో మృగేందర్ కు 15 రోజులపాటు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.