Cyberabad: సైబరాబాద్ లో పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులు

Drunken Drive Cases Increasing In Cyberabad

  • ఈ ఏడాది ఇప్పటికే 32,818 కేసులు
  • అందులో ఎక్కువగా బైకర్లపైనే
  • 25,614 మంది బైకర్లపై కేసులు

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా హైదరాబాద్ లోని ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 32,818 కేసులు నమోదయ్యాయి. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరిగి.. ప్రాణాలు పోతున్నా చాలా మంది మారడం లేదు. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో బైకర్లే ఎక్కువగా ఉన్నారు.

25,614 మంది బైకర్లు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. 5,947 కార్లు, 1,055 ఆటో డ్రైవర్లు, 202 భారీ వాహనాల డ్రైవర్లు కేసుల్లో పట్టుబడ్డారు. ఈ ఒక్క కమిషనరేట్ లోనే మద్యం తాగి నడపడం వల్ల 210 ప్రమాదాలు సంభవించగా.. 232 మంది మరణించారు. మొత్తం ప్రమాదాల్లో డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు 30.07 శాతం ఉండడం ఆందోళన కలిగించే విషయం. మరణాలు 31.07 శాతంగా ఉన్నాయి. తనిఖీల్లో ఎక్కువగా 35 ఏళ్ల లోపు వారే దొరికిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News