Pakistan: ఇండియా నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్ వెళ్లే వాహనాలకు అనుమతి ఇచ్చిన పాకిస్థాన్

Pakistan gives permission to Indian vehicles going to Afghanistan

  • ఆకలితో అలమటిస్తున్న ఆఫ్ఘనిస్థాన్
  • 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపేందుకు సిద్ధమైన ఇండియా
  • భారత లారీలకు అనుమతి ఇచ్చిన పాక్

పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయి. ఆహారం అందక అక్కడి ప్రజలు అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ఇండియా కూడా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను అందించేందుకు రెడీ అయింది.

అయితే ఇవి ఆప్ఘనిస్థాన్ కు చేరాలంటే పాకిస్థాన్ గుండా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి వెళ్లే వాహనాలకు పాక్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి 500 లారీలు ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది.

  • Loading...

More Telugu News