Bus: బల్గేరియాలో తీవ్ర విషాదం... బస్సు మంటల్లో చిక్కుకుని 45 మంది దుర్మరణం
![Bus caught in fire as tourists charred to death in Bulgaria](https://imgd.ap7am.com/thumbnail/cr-20211123tn619cb2566a504.jpg)
- సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతున్న బస్సు
- ఒక్కసారిగా బస్సులో మంటలు
- కొన్ని నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైన బస్సు
- కాలి బూడిదైన పర్యాటకులు
యూరప్ దేశం బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకున్న ఘటనలో 45 మంది సజీవ దహనం అయ్యారు. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.
ఈ ఘటనలో 45 మంది మరణించగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20211123fr619cb2b3cadc2.jpg)