GV Anjaneyulu: త్వరలోనే వైసీపీ నేతలకు అసలు సినిమా చూపిస్తాం: గొట్టిపాటి రవికుమార్

Jagan slapped his own father says GV Anjaneyulu
  • తప్పుగా మాట్లాడిన వారికి పుట్టగతులు వుండవు  
  • ప్రజాక్షేత్రంలో వైసీపీ తప్పులను ఎండగడతామన్న గొట్టిపాటి  
  • చట్టసభలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు అన్న ఆంజనేయులు 
ఏపీ అసెంబ్లీలో నిన్నటి సంఘటనపై టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడిన వారికి పుట్టగతులు ఉండవని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని అన్నారు. త్వరలోనే వైసీపీ నేతలకు అసలు సినిమా చూపిస్తామని చెప్పారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ తప్పులను ఎండగడతామని అన్నారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎందుకొచ్చామా? అని బాధపడేలా చేస్తామని అన్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, చట్టసభలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు వైసీపీ అంతానికి నాంది పలుకుతాయని చెప్పారు. అసెంబ్లీలో అడుగుపెట్టనని చంద్రబాబు అన్నారంటే... వైసీపీ దుర్మార్గులు ఆయనను ఎంత బాధ పెట్టారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబును వైసీపీ మంత్రులు దూషిస్తుంటే జగన్ వెకిలినవ్వులు నవ్వుతాడా? అని మండిపడ్డారు.
GV Anjaneyulu
Gottipati Ravi
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News