: మారని హరికృష్ణ.. పచ్చకండువాకు దూరం దూరం


కొన్నాళ్లుగా పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న హరికృష్ణ తీరు ఏ మాత్రం మారలేదని మహానాడు సాక్షిగా రుజువైంది. అసలు మాహానాడుకు రావడమే సందేహమనుకోగా.. చంద్రబాబు మంతనాల కారణంగా ఎట్టకేలకు ఆయన పార్టీ కార్యక్రమానికి చాలా కాలం తర్వాత విచ్చేశారు. అయితే, మహానాడును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న సమయంలో వేదికపై ఉన్న హరికృష్ణ ముభావంగా కనిపించారు. అంతేకాదు, పార్టీ నేత ఒకరు పచ్చకండువా కప్పబోతే కప్పుకోవడానికి ససేమిరా అన్నారు. దీంతో హరికృష్ణ వైఖరి మరోసారి చర్చకు దారితీసింది.

వాస్తవానికి హరికృష్ణ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, సోదరుడు బాలకృష్ణ అంటే ఈ మధ్య గిట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెడుతున్నారంటూ ఆయన మనసులో కోపం పెంచుకున్నారు. ఈ విభేదాల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లిన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను వాడి టీడీపీలో విభేదాలకు ఆజ్యం పోశారు. ఈ సందర్భంగానే బాలయ్య మాట్లాడుతూ.. ఫ్లెక్సీల ఏర్పాటును ఖండించాలని, లేకుంటే తీవ్ర పరిణామలు చూడాల్సి ఉంటుందని బాలయ్య ఘాటుగా వ్యాఖ్యానించడం తెలిసిందే. దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇవి తేలిపోలేదని హరికృష్ణ తాజా వైఖరి తెలియజేస్తోంది.

  • Loading...

More Telugu News