Pawan Kalyan: స్థానిక ఎన్నికల్లో పోరాడిన జనసేన అభ్యర్థులకు అభినందనలు.. ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

- ఏపీలో స్థానిక ఎన్నికలు
- విజయం సాధించిన పలువురు జనసేన అభ్యర్థులు
- శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- గెలిచినవారిపై బాధ్యత పెరిగిందని వెల్లడి
- ప్రజల పక్షాన నిలవాలని పిలుపు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగిందని వివరించారు. క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో పోరాడిన జనసేన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలిచారని కొనియాడారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, పరిషత్, పంచాయతీ ఉపఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన ప్రకటనలో వివరించారు.