Peddireddi Ramachandra Reddy: ఇకపై కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు: పెద్దిరెడ్డి

We dont thing Chandrababu will contest again from Kuppam says Peddireddi Ramachandra Reddy

  • కులమతాలకు అతీతంగా జగన్ పాలన సాగుతోంది
  • దాని ఫలితమే కుప్పంలో వైసీపీ విజయం
  • టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు కుప్పం ప్రజలు వైసీపీని గెలిపించారు

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా జగన్ సుపరిపాలన సాగుతోందని... దాని ఫలితమే కుప్పంలో వైసీపీ ఘన విజయమని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పాలన సాగుతోందని అన్నారు. ఇకపై కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తారని తాము అనుకోవడం లేదని చెప్పారు.

టీడీపీ దౌర్జన్యకాండకు పాల్పడుతోందని... దాన్ని అడ్డుకునేందుకే కుప్పం ప్రజలు వైసీపీని గెలిపించారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఓడించారని చెప్పారు. వైసీపీ దొంగ ఓట్లు వేయించిందనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ... ఏ పోలింగ్ బూత్ లో అయినా దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ నేతలు అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు తనపై పోటీ చేస్తే స్వాగతిస్తానని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News