Kalyanram: డిసెంబర్ లోనే రానున్న 'బింబిసార'

Bimbisara movie update

  • కల్యాణ్ రామ్ నుంచి మరో సినిమా
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ
  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్
  • కథానాయికగా సంయుక్త మీనన్  

ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా కల్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా చేస్తున్న 'బింబిసార' పోస్టర్ ఇటీవల పలకరించింది. ఆ తరువాత ఎక్కడ ఎలాంటి చడీచప్పుడూ లేదు. దాంతో అసలు ఈ ప్రాజెక్టు ఏ దశలో ఉందనేది ఎవరికీ తెలియలేదు. కానీ ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందనేది తాజా సమాచారం.

'బింబిసార' పూర్తి చారిత్రక చిత్రం కాదని తెలుస్తోంది. ఈ కథ టైమ్ ట్రావెల్ చుట్టూ నడుస్తుందని అంటున్నారు. టైమ్ మిషన్ లో హీరో 'బింబిసార' కాలానికి చేరుకుంటాడు. అక్కడ జరిగే సంఘటనలు ఆసక్తిని రేకెత్తిస్తాయన్న మాట. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్త మీనన్ సందడి చేయనుంది.

ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. 'అఖండ' డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ సినిమాలో ఈ సినిమా రిలీజ్ డేట్ తో కూడిన ట్రైలర్స్ ను వదులుతారట. సొంత బ్యానర్లో .. కొత్త జోనర్లో కల్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి.

  • Loading...

More Telugu News