Babar Azam: ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ కెప్టెన్ గా బాబర్ అజామ్... టీమిండియా ఆటగాళ్లకు దక్కనిస్థానం
- ముగిసిన టీ20 వరల్డ్ కప్
- టోర్నీలో పాల్గొన్న జట్ల నుంచి ఆటగాళ్ల ఎంపిక
- ఆరు జట్ల ఆటగాళ్లకు ఐసీసీ టీమ్ లో స్థానం
- 12వ ఆటగాడిగా షహీన్ అఫ్రిది
టీ20 వరల్డ్ కప్ ముగిసిన ఒక రోజు అనంతరం ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ను ప్రకటించింది. ఈ జట్టుకు పాక్ సారథి బాబర్ అజామ్ ను కెప్టెన్ గా పేర్కొంది. మొత్తం 6 జట్ల ఆటగాళ్లు ఈ ఐసీసీ జట్టులో స్థానం దక్కించుకోగా, టీమిండియా నుంచి ఏ ఒక్క ఆటగాడు ఈ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు.
బాబర్ ను ఐసీసీ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేయడం పట్ల పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. బాబర్ అందుకు అర్హుడేనని పేర్కొన్నారు.
కాగా ఐసీసీ తాజా జట్టుకు 12వ ఆటగాడిని కూడా ఎంపిక చేశారు. టీమిండియా ఆటగాళ్లలో ఏ ఒక్కరినీ కనీసం 12వ ఆటగాడినూ పరిగణనలోకి తీసుకోలేదు.
ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ వివరాలు...
బాబర్ అజామ్ (కెప్టెన్, పాకిస్థాన్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), జోస్ బట్లర్ (వికెట్ కీపర్, ఇంగ్లండ్), చరిత్ అసలంక (శ్రీలంక), ఐడెన్ మార్ క్రమ్ (దక్షిణాఫ్రికా), మొయిన్ అలీ (ఇంగ్లండ్), వనిందు హసరంగ (శ్రీలంక), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), జోష్ హేజెల్ వుడ్ (ఆస్ట్రేలియా), ఆన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), 12వ ఆటగాడు: షహీన్ అఫ్రిది (పాకిస్థాన్).