Suicides: మద్యం, మాదకద్రవ్యాల వల్ల దేశంలో ప్రతి గంటకు ఒక బలవన్మరణం!

Drugs and liquor caused suicides in society

  • మద్యం, డ్రగ్స్ వల్ల పెరుగుతున్న ఆత్మహత్యలు
  • 2019లో 7,860 బలవన్మరణాలు
  • 2020లో 9 వేల ఆత్మహత్యలు
  • 17 శాతం పెరుగుదల

మనిషి జీవితాన్ని వ్యసనాలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మద్యం, మాదకద్రవ్యాలు ఆరోగ్య రీత్యా, సామాజిక రీత్యా వ్యక్తులను పతనం దిశగా నడిపిస్తాయి. కాగా, మత్తు పదార్థాలు, మానవులపై వాటి ప్రభావానికి సంబంధించి విడుదలైన నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

2020లో మద్యం, మాదకద్రవ్యాల కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవించిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. 2019తో పోల్చితే వ్యసనాల బారినపడి బలవన్మరణం చెందిన వారి సంఖ్య 2020లో 17 శాతం అధికంగా నమోదైంది. 2019లో ఇలాంటి ఘటనలు 7,860 జరగ్గా, గతేడాది 9 వేల వరకు నమోదయ్యాయట. ఈ తరహా ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే 43 శాతం కేసులు వెలుగుచూశాయి.

దీనిపై మానసిక వైద్యులు, నిపుణులు స్పందిస్తూ, అప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతూ, కుంగిపోయి ఉన్నవారిని మద్యం, మాదకద్రవ్యాలు మరింత కుంగదీస్తాయని, ఆత్మహత్యలకు ఇదే కారణమని వివరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వారిలో ఉన్న వేదనను కూడా డ్రగ్స్, మద్యం మరింతగా పెంచుతాయని వెల్లడించారు.

Suicides
Drugs
Liquor
Report
India
  • Loading...

More Telugu News