Vijay Devarakonda: 'లైగర్' కోసం వెయిట్ చేస్తున్నాను: దుల్కర్

Liger movie updare

  • మలయాళంలో స్టార్ హీరోగా దుల్కర్ 
  • టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టి 
  • రీసెంట్ గా రంగంలోకి దింపిన 'కురుప్'
  • 'లైగర్' పై చూపుతున్న ఆసక్తి

తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ తెలుసు. 'ఓకే బంగారం' .. 'మహానటి' సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. రీసెంట్ గా 'కురుప్' సినిమా ద్వారా కూడా ఆయన తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం'తో పాటు, దుల్కర్ 'కురుప్' కూడా నిన్ననే థియేటర్లకు వచ్చింది.

'పుష్పక విమానం' టీమ్ కి సోషల్ మీడియా ద్వారా దుల్కర్ విషెస్ చెప్పాడు. ఆయన ట్వీట్ కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ, దుల్కర్ ను ఒక సోదరుడిగా భావిస్తున్నట్టు చెప్పాడు. తాను 'లైగర్' షూటింగులో ఉన్నట్టుగా విజయ్ చెబితే, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని దుల్కర్ అన్నాడు. ఇద్దరి హీరోల మధ్య మంచి స్నేహమే కుదురుతున్నట్టుగా అనిపిస్తోంది.

ఇప్పుడు మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్న కారణంగా, దుల్కర్ ఇక్కడ గట్టిగానే దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. తన సినిమాలను వరుసగా దింపే ప్రయత్నంలో ఉన్నాడని అంటున్నారు. రేపటి రోజున 'లైగర్' మలయాళానికి కూడా వెళ్లొచ్చు .. లేదంటే అక్కడ 'దుల్కర్' రీమేక్ చేయవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News