Upasana: సమంత కారణంగా మాంసాహారం తినడం తగ్గించేశా: ఉపాసన

Upasana opines on her close friend Samantha

  • సమంత కల్మషంలేని వ్యక్తి అని కితాబు
  • ఆమెది నిజమైన ప్రేమ అని ప్రశంస 
  • ఎన్నో అంశాల్లో మద్దతుగా నిలిచిందని వెల్లడి
  • ఆమె వ్యాసాలు తనను మార్చివేశాయని వ్యాఖ్య

అందాల నటి సమంత, మెగా కోడలు ఉపాసన మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. తాజాగా తన సన్నిహితురాలు సమంతపై ఉపాసన స్పందించారు. సమంత మంచి మనసున్న వ్యక్తి అని, ఇతరులు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందిస్తుందని వెల్లడించారు. ఆ విధంగా తనకు ఎన్నో అంశాల్లో మద్దతుగా నిలిచిందని తెలిపారు. సమంత కల్మషం లేని వ్యక్తి అని, ఆమెది నిజమైన ప్రేమ అని ఉపాసన కొనియాడారు.

తాను తెలంగాణ ప్రాంతానికి చెందినదాన్నని, దసరా వంటి పండుగల సమయాల్లోనూ మాంసాహారం తింటానని తెలిపారు. అయితే, సమంత కారణంగా తనలో ఎంతో మార్పు వచ్చిందని, క్రమంగా మాంసాహారం తినడం తగ్గించానని వివరించారు. ఆమె రాసిన వ్యాసాలు తనను మార్చివేశాయని ఉపాసన పేర్కొన్నారు. 

Upasana
Samantha
Friendship
Tollywood
  • Loading...

More Telugu News