Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ అల్లుడు ఇంటికి బాంబు బెదిరింపు!

Fake bomb call to Stalin son in law house

  • శబరీశన్ ఇంట్లో బాంబు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్
  • జాగిలం, మెటల్ డిటెక్టర్లతో ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు
  • ఇంట్లో లభ్యం కాని బాంబు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. ఈ బెదిరింపు చేసిన కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వాసుదేవన్ (65) అనే వ్యక్తి చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి శబరీశన్ ఇంట్లో బాంబు ఉంచినట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు.

దీంతో ఉలిక్కి పడిన పోలీసులు హుటాహుటిన శబరీశన్ ఇంటికి జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఇంట్లో బాంబు లభ్యం కాకపోవడంతో, అది తప్పుడు కాల్ అని నిర్ధారించారు. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తమ విచారణలో ఒక నిర్ధారణకు వచ్చారు.

  • Loading...

More Telugu News