Ravi Babu: హీరోయిన్ పూర్ణతో నాకు ఎలాంటి అఫైర్ లేదు: రవిబాబు

Dont have affair with Poorna says Ravi Babu

  • షూటింగ్ పూర్తయిన తర్వాత నేను హీరోయిన్లతో మాట్లాడను
  • విలువలకు నేను చాలా ప్రాధాన్యతను ఇస్తాను
  • పూర్ణ అభినయం చూసే ఆమెకు అవకాశాలు ఇచ్చాను

సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు చనువుగా ఉన్నా వారి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు పుట్టుకురావడం సాధారణం. తాజాగా హీరోయిన్ పూర్ణ, దర్శకుడు రవిబాబుల మధ్య అఫైర్ ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్తలపై రవిబాబు స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు.

షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోయిన్లతో మాట్లాడటం కానీ, వారిని కలవడం కానీ తాను చేయనని చెప్పారు. విలువలకు తాను ప్రాధాన్యతను ఇస్తానని అన్నారు. పూర్ణ అభినయం చూసే ఆమెను మూడు సినిమాల్లో తీసుకున్నానని... మరో కారణం వల్ల కాదని తెలిపారు. రవిబాబు దర్శకత్వంలో 'అవును', 'అవును 2', 'లడ్డుబాబు' సినిమాల్లో పూర్ణ నటించింది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది.

Ravi Babu
Poorna
Affair
Tollywood
  • Loading...

More Telugu News