Andhra Pradesh: మద్యం ధరలను సవరించిన ఏపీ ప్రభుత్వం
- రూ. 400 లోపు మద్యం బ్రాండ్లపై 50 శాతం వ్యాట్
- రూ. 2,500 - 3,500 మధ్య మద్యం కేసుపై 55 శాతం వ్యాట్
- రూ. 200 కంటే తక్కువ ధర ఉన్న బీర్లపై 50 శాతం వ్యాట్
మద్యం ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్నును సవరిస్తూ జీవో జారీ చేసింది. రూ. 400 లోపు మద్యం బ్రాండ్లపై 50 శాతం వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయించారు. రూ. 400 నుంచి రూ. 2,500 వరకు ఉన్న మద్యం కేసుపై 60 శాతం వ్యాట్... రూ. 2,500 నుంచి రూ. 3,500 వరకు ఉన్న మద్యం కేసుపై 55 శాతం వ్యాట్, రూ. 5 వేలు ఆపై ఉన్న మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలు చేయనున్నారు. రూ. 200 కంటే తక్కువ ధర ఉన్న బీర్ బ్రాండ్లపై 50 శాతం వ్యాట్... రూ. 200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ వసూలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.