Etela Rajender: ఇక అసెంబ్లీలో బీజేపీ 'ఆర్ఆర్ఆర్'.. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం!

etela takes oath as mla

  • అసెంబ్లీలోని స్పీక‌ర్ చాంబ‌ర్‌లో కార్య‌క్ర‌మం
  • ప్ర‌మాణ స్వీకారం చేయించిన పోచారం
  • పాల్గొన్న ప‌లువురు నేత‌లు

తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేందర్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈట‌ల రాజేంద‌ర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ రోజు ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈట‌ల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేయించారు.

తెలంగాణ నేత‌లు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈటల రాజేంద‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ఇక అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ (రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్) క‌న‌ప‌డనున్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురి నుంచి 103కి పెరుగుతార‌ని కొన్ని రోజులుగా ఆ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News