KCR: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నేతలు

BJP Kisan Morcha leaders fires on CM KCR

  • సీఎం కేసీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం
  • కేసీఆర్ పై బీజేపీ కిసాన్ మోర్చా నేతల ఆగ్రహం
  • కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడన్న బండి సంజయ్
  • అబద్ధాల శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారని ఎద్దేవా  

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ధాన్యం కొనుగోలు నుంచి పెట్రో ధరల వరకు సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మధ్య మాటలయుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో, బీజేపీ కిసాన్ మోర్చా నేతలు హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు, బండి సంజయ్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజా తానే కొంటానని, కేంద్రంతో పనేంటని కేసీఆర్ గతంలో అన్నారని తెలిపారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారో లేదో నిపుణులతో కలిసి తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా అబద్ధాలు చెప్పొచ్చా? అబద్ధాల కోసమే కేసీఆర్ ఒక శాఖను ఏర్పాటు చేసి, ఆ శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించాడని బండి సంజయ్ విమర్శించారు.

  • Loading...

More Telugu News