Crime News: 3 నెలల చిన్నారి నోటి నుంచి నురగలు.. అప్పటికే మృతి.. ఆసుపత్రికి తీసుకెళ్లాక దుప్పటి నుంచి బయటపడిన పాము!

Snake Bit 3 in a family 3 month old kid dies

  • చిన్నారి తల్లిదండ్రులనూ కాటేసిన విష సర్పం
  • ఆసుపత్రిలో చికిత్స.. తప్పిన ప్రాణాపాయం
  • తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం

ఒకే ఇంట్లో పాము ముగ్గురిని కాటేసింది. 3 నెలల చిన్నారిని బలి తీసుకుంది. ఈ విషయం ఆసుపత్రిలో పాము ఆ చిన్నారి దుప్పటి నుంచి బయటపడేదాకా తెలియలేదు. ఈ విషాద ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా శనిగరంలో సంభవించింది. ప్రస్తుతం ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనిగపురానికి చెందిన మమత, క్రాంతి దంపతులకు 3 నెలల చిన్నారి ఉంది.

ఆదివారం ఉదయం నిద్ర లేచి చూసే సరికి చిన్నారి నోటి నుంచి నురగలు వస్తుండడాన్ని ఆ దంపతులు గుర్తించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే పాప మరణించింది. అయితే, ఆసుపత్రిలోనే పాప దుప్పటి నుంచి పాము బయట పడింది. దీంతో పాము కాటేసిందని నిర్ధారించారు. తర్వాత కాసేపటికే పాప తల్లిదండ్రులూ కళ్లు తిరిగిపడిపోయారు. వారికి పాము కరిచిందని నిర్ధారణ కావడంతో ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. వారికి అపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు.

Crime News
Snake Bite
Telangana
Mahabubabad District
  • Loading...

More Telugu News