Karthikeya: కార్తికేయ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు: తాన్య రవిచంద్రన్

Raja Vikramarka movie update

  • ఈ నెల 12న రానున్న 'రాజా విక్రమార్క'
  • కార్తికేయ జోడీగా చేసిన తాన్య రవిచంద్రన్
  • తెలుగులో తను చేసిన తొలి సినిమా ఇదే
  • తప్పకుండా హిట్ అవుతుందంటున్న తాన్య

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో చాలామంది కథానాయికలు పరిచయమవుతున్నారు. ఆ జాబితాలో తాన్య రవిచంద్రన్ ఒకరిగా కనిపిస్తుంది. కార్తికేయ జోడీగా 'రాజా విక్రమార్క' సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "చెన్నైలో నేను పీజీ చేస్తున్న సమయంలోనే నాకు తమిళ సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా చేసి చూద్దామని అనుకున్న నేను, వరుసగా మూడు సినిమాలు చేశాను. ఆ తరువాత చదువును పూర్తిచేసి నటనను కంటిన్యూ చేస్తున్నాను.  

దర్శకుడు శ్రీ సరిపల్లి చెన్నైకి వచ్చి నాకు ఈ కథ వినిపించాడు. కథలో నా పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాను. హోమ్ మినిష్టర్ కూతురిగా ఈ సినిమాలో కనిపిస్తాను. కార్తికేయ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు .. ఆయనతో కలిసి పనిచేయడం చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చింది.

Karthikeya
Tanya Ravichandran
Sri Saripalli
  • Loading...

More Telugu News