Rajasekhar: రేపు చెన్నైలో రాజశేఖర్ తండ్రి అంత్యక్రియలు... జీవిత ప్రకటన
- నిన్న సాయంత్రం మా మామగారు మృతి చెందారు
- ఆయన భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తరలిస్తున్నాం
- రేపు మధ్యాహ్నం 12 తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తాం
సినీ నటుడు రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
'హైదరాబాదులో నిన్న సాయంత్రం 6.30 గంటలకు మా మామగారు వరదరాజన్ (రిటైర్ట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్) చనిపోయారని చెప్పడానికి చింతిస్తున్నాం. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఆయన భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తరలిస్తున్నాం. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన ఇంటివద్ద (నంబర్ 26, AI బ్లాక్, 8వ మెయిన్ రోడ్డు, అన్నా నగర్, చెన్నై-40) ఉంచుతాం. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంత్యక్రియలను నిర్వహిస్తాం. అంత్యక్రియల సమయాన్ని ఇంకా నిర్ణయించలేదు' అని జీవిత తన ప్రకటనలో పేర్కొన్నారు. 9849922944, 9849422944 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.