Chiranjeevi: దీపావళి సందడిలో 'ఆచార్య' నీలాంబరి!

Acharya song  promo released

  • 'ఆచార్య' నుంచి మరో అప్ డేట్
  • దీపావళి సందడిలో సాంగ్ ప్రోమో
  • మణిశర్మ నుంచి మరో మంచి మెలోడీ 
  • రేపు రిలీజ్ కానున్న ఫుల్ సాంగ్ 
  • ఫిబ్రవరి 4వ తేదీన సినిమా రిలీజ్  

మొదటి నుంచి కూడా కొరటాల వినోదం .. సందేశం కలగలిసిన కథాకథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అపజయమెరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఆచార్య' సినిమా రూపొందింది. చిరంజీవి - కాజల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో, మరో జోడీగా చరణ్ - పూజ హెగ్డే కనిపించనున్నారు.

ఆశయాన్ని సాధించాలంటే ఆవేశం ఉండాలనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. చరణ్ - నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను, ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా 'నీలాంబరి' సాంగ్ ను రేపు వదలనున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ఆ సాంగ్ ప్రోమోను కొంతసేపటి క్రితం వదిలారు. "నీలాంబరి .. నీలాంబరి వేరెవ్వరే నీలా మరి .. నీ అందమే నీ అల్లరి" అంటూ ఈ పాట సాగుతోంది. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. మణిశర్మ బ్యూటిఫుల్ మెలోడీస్ లో ఈ పాటకి చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News