Shiva Karthikeyan: 100 కోట్ల క్లబ్ లో చేరిన 'డాక్టర్'

Doctor movie update

  • శివకార్తికేయన్ నుంచి వచ్చిన 'డాక్టర్'
  • 25 రోజుల్లో 100 కోట్ల వసూళ్లు
  • ఆడియన్స్ కి థ్యాంక్స్  చెప్పిన హీరో
  • ప్రియాంక అరుళ్ మోహన్ కి ఊరట

తెలుగులో నాని మాదిరిగానే తమిళంలో శివకార్తికేయన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ నాని ఎంచుకునే కథలవంటివే అక్కడ ఆయన చేస్తుంటాడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన శివకార్తికేయన్ అంచలంచెలుగా ఎదిగాడు. తనకి నచ్చిన కథలను చేయడం కోసం నిర్మాతగా కూడా మారాడు. అలా ఆయన నిర్మించిన సినిమానే 'డాక్టర్'.
 
నెల్సన్ దిలీప్ కుమార్ కి తమిళనాట దర్శకుడిగా మంచి క్రేజ్ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్లు .. యాక్షన్ కామెడీలు చేయడంలో ఆయనకి ప్రత్యేకత ఉంది. ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, శివ కార్తికేయన్ సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది.

అక్టోబర్ 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా, 25 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా శివకార్తికేయన్ కృతజ్ఞతలు తెలియజేశాడు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ కి ఈ సినిమా ఊరటనిచ్చినట్టే.

Shiva Karthikeyan
Priyanka Arul Mohan
  • Loading...

More Telugu News