Nani: నాని చేతుల మీదుగా కాసేప‌ట్లో 'ఓసీఎఫ్ఎస్' వెబ్ సిరీస్ టీజ‌ర్

ocfc web series trailer  to be launched by nani

  • ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
  • నిర్మాతగా నిహారిక‌
  • జీ5లో నవంబర్ 19న ఈ వెబ్ సిరీస్‌ ప్రారంభం
  • 40 నిమిషాల నిడివి చొప్పున‌ మొత్తం 5 ఎపిసోడ్లు

నాగ‌బాబు కుమార్తె నిహారిక ఓసీఎఫ్ఎస్ (ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ) వెబ్ సిరీస్  నిర్మాతగా వ్యవహరిస్తోన్న విష‌యం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ స్టోరీతో  జీ5లో నవంబర్ 19న ఈ వెబ్ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ వెబ్ సిరీస్  40 నిమిషాల నిడివి చొప్పున‌ మొత్తం 5 ఎపిసోడ్లుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ వెబ్ సిరీస్ టీజ‌ర్ కాసేప‌ట్లో విడుద‌ల కానుంది. దీన్ని నేచుర‌ల్ స్టార్ విడుద‌ల చేస్తార‌ని ఓసీఎఫ్ఎస్ బృందం ప్ర‌క‌టించింది. ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సీనియర్ నటీనటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • Loading...

More Telugu News