Huzurabad: ముగిసిన హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్

By Polls in Telangana and AP just concludes

  • సాయంత్రం 7 గంటలతో ముగిసిన పోలింగ్
  • ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికలు   
  • అవాంఛనీయ ఘటనలు జరగలేదన్న కడప కలెక్టర్   
  • నవంబరు 2న ఫలితాల వెల్లడి 

తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ నిర్వహించారు. హుజూరాబాద్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 76.26 శాతం పోలింగ్ నమోదైంది. బద్వేలులో అదే సమయానికి 59.58 శాతం ఓటింగ్ జరిగింది. కాగా, ఈ రెండు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబరు 2న చేపట్టి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

చెదురుమదురు ఘటనలు, స్వల్ప ఘర్షణలు మినహా తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోనే జరిగాయి. బద్వేలు ఉప ఎన్నికపై కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు స్పందిస్తూ, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. బద్వేలు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.

Huzurabad
Badvel
By Elections
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News