Allu Arjun: '​పుష్పక విమానం' ట్రైలర్ ను ఆవిష్కరించిన అల్లు అర్జున్... "థాంక్యూ బన్నీ అన్నా" అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్​

Allu Arjun launched Pushpaka Vimanam trailer
  • ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన జంటగా పుష్పకవిమానం
  • దామోదర దర్శకత్వంలో కామెడీ చిత్రం
  • నవంబరు 12న రిలీజ్
  • ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్న బన్నీ
యువ హీరో ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన జంటగా దామోదర దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్పక విమానం'. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు ఆవిష్కరించారు. 'పుష్పక విమానం' ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషం కలిగిస్తోందని అల్లు అర్జున్ ట్విట్టర్ లో వెల్లడించారు. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ సోదరుడు విజయ్ దేవరకొండ స్పందించారు. తన తమ్ముడి చిత్రం ట్రైలర్ ను అల్లు అర్జున్ ఆవిష్కరించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. "థాంక్యూ బన్నీ అన్నా" అంటూ ట్విట్టర్ లో బదులిచ్చారు. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పిస్తుండడం తెలిసిందే. విజయ్ మట్టపల్లి, గోవర్ధన్ రావు దేవరకొండ నిర్మాతలు. 'పుష్పక విమానం' చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టయినర్ జానర్ లో తెరకెక్కినట్టు చిత్రబృందం పేర్కొంది.
Allu Arjun
Pushpaka Vimanam
Trailer
Vijay Devarakonda
Tollywood

More Telugu News