Sri Lanka: టీ20 వరల్డ్ కప్: శ్రీలంకపై టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా

Sri Lanka bats first after toss lost to South Africa

  • గ్రూప్-1లో శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా
  • మొదట బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు
  • శ్రీలంక 6 ఓవర్లలో 1 వికెట్ కు 39 రన్స్
  • ఓపెనర్ కుశాల్ పెరెరాను అవుట్ చేసిన నోర్జే

టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో నేడు గ్రూప్-1లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలో దిగాయి. గ్రూప్-1లో ఇరుజట్లు చెరో రెండు మ్యాచ్ లు ఆడి ఒక్కో విజయం నమోదు చేశాయి. షార్జా వేదికగా జరుగుతున్న ఈ పోరులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 1 వికెట్ నష్టానికి 38 పరుగులు. ఓపెనర్ పతుమ్ నిస్సాంక 18, వన్ డౌన్ బ్యాట్స్ మన్ చరిత్ అసలంక 10 పరుగులతో ఆడుతున్నారు. 7 పరుగులు చేసిన ఓపెనర్ కుశాల్ పెరెరాను దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జే బౌల్డ్ చేశాడు.

  • Loading...

More Telugu News