West Indies: టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ అమీతుమీ

West Indies takes in South Africa

  • దుబాయ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచిన సఫారీలు
  • మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్
  • ఎవిన్ లూయిస్ విధ్వంసక బ్యాటింగ్

టీ20 వరల్డ్ కప్ లో నేడు తొలి మ్యాచ్ లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే, వెస్టిండీస్ యువ ఓపెనర్ ఎవిన్ లూయిస్ విరుచుకుపడడంతో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా పడలేదు సరికదా, దక్షిణాఫ్రికా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు 7 ఓవర్లలో 46 పరుగులు చేయగా, ఎవిన్ లూయిస్ ఒక్కడే 36 పరుగులు సాధించాడు. అందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో లెండిల్ సిమ్మన్స్ 7 పరుగులతో ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News