Meghalaya: ఆరెస్సెస్ కు చెందిన వ్యాపారవేత్త రూ.300 కోట్లు లంచం ఇవ్వజూపారు: మేఘాలయ గవర్నర్ సంచలన ఆరోపణలు
- కశ్మీర్ గవర్నర్ గా ఉన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించా
- ప్రధాని మోదీ నా నిర్ణయాన్ని సమర్థించారు
- అవసరమైతే పదవి వదులుకునేందుకు సిద్ధమయ్యా
జీవితంలో ఎప్పుడూ రాజీపడలేదని, అవినీతికి పాల్పడలేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. నూతన అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో తనకు రూ.300 కోట్లు ఆశచూపారని, రెండు ఫైళ్లపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారని, అయినా తాను తలొగ్గలేదని చెప్పారు.
ఆ ఫైళ్లు ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆరెస్సెస్ తో సంబంధం ఉన్న వ్యక్తికి సంబంధించినవని వెల్లడించారు. ఒత్తిళ్లకు భయపడకుండా విజ్ఞప్తిని తిరస్కరించానన్నారు. ప్రధాని మోదీ కూడా తన నిర్ణయాన్ని సమర్థించారని చెప్పారు. పదవిని వీడేందుకూ తాను సిద్ధమయ్యానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.