: చేప నూనెతో మధుమేహానికి చెక్!
చేప నూనె వాడకం వల్ల మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉండడంతోబాటు మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని తాజా అధ్యయనం చెబుతోంది. చేప నూనెతో కూడిన ఔషధాల్లో ఒమెగా త్రీ ఫాటీ ఆమ్లాలు తో కూడిన ఔషధాలు రక్తంలోని గ్లూకోజ్‌ని నియంత్రిస్తాయని ఈ పరిశోధనలో తేలింది.
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన జాసన్ వూ మాట్లాడుతూ చేప నూనె రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలోను, ఇంకా కొవ్వు కణాల మెటబాలిజంలోను కీలకంగా పనిచేస్తాయని అన్నారు. తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిపారు. రక్త ప్రసరణలో అడిపోనెక్టిన్ స్థాయి అధికంగా ఉండడం మధుమేహ వ్యాధికి, ఇంకా గుండెపోటుకు కూడా కారణం అవుతుందని, కానీ చేప నూనె అడిపోనెక్టిన్ స్థాయిని తగినంతగా ఉండేలా చేయడంతోబాటు టైప్2 మధుమేహం రాకుండా ఉండేలా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణ చేస్తుందని వూ చెబుతున్నారు.