Samantha: బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి సమంత తీర్థయాత్రలు

Samantha On Chardham Yatra With Her Bestie

  • శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్ర
  • మొదటగా యమునోత్రికి వెళ్లిన స్నేహితులు
  • వశిష్ఠ మహర్షి గుహల సందర్శన

సమంత తీర్థయాత్రలకు వెళ్లింది. తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రకు వెళ్లింది. తీర్థయాత్రలో భాగంగా తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి  సమంత ‘యమునోత్రి’కి వెళ్లింది. ఈ విషయాన్ని శిల్పారెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. హెలికాప్టర్ ముందు సమంతతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. ‘టేకాఫ్.. మొదట యమునోత్రికి వెళ్తున్నాం’ అంటూ మెసేజ్ చేసింది.

ఇన్ స్టా స్టోరీస్ లో దైవదర్శనం అనంతరం దిగిన ఫొటోను పెట్టింది. ‘చార్ ధామ్ యాత్ర.. ఎప్పటికీ మన స్నేహం చెరిగిపోదు’ అని పేర్కొంది. టూర్ లో భాగంగా గంగానది తీరాన్ని, అక్కడి వశిష్ఠ మహర్షి గుహలను వారు సందర్శించారు. ఆ ఫొటోలను, వీడియోలను శిల్పారెడ్డి ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. కాగా, వ్యక్తిగత కారణాలతో ఇటీవల నాగచైతన్యతో సామ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమెపై ఎన్నెన్నో ఆరోపణలు రావడంతో వాటన్నింటికీ కౌంటర్ ఇచ్చి చెక్ పెట్టింది.

Samantha
Shilpa Reddy
Tollywood
Chardham
Yamunotri
  • Loading...

More Telugu News