Prabhas: 'సలార్' విలన్ గా మలయాళం స్టార్!

Salaar movie update

  • షూటింగు దశలో 'సలార్'
  • కథానాయికగా శ్రుతిహాసన్
  • ప్రతినాయకుడి పాత్రపై ఉత్కంఠ
  • తెరపైకి పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు

ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమా రూపొందుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, చాలా లేట్ గా షెడ్యూల్స్ మొదలవుతూ ఉంటాయని చాలామంది అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగుతో చకచకా షూటింగు కానిచ్చేస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రధానమైన ప్రతినాయకుడు ఎవరనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ వెళుతోంది. ప్రశాంత్ నీల్ విలన్ పాత్రలను డిజైన్ చేసే తీరు ఎలా ఉంటుందో తెలియడం వలన ఈ అంశం అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే తాజాగా విలన్ పాత్రకి గాను మలయాళ స్టార్ పేరు వినిపిస్తోంది.

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్  స్టార్. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో ఆయన దూసుకుపోతున్నాడు. ఈ సినిమా లోని విలన్ పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి ఉంది. కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Prabhas
Sruthi Haasan
Pruthviraj Sukumaran
  • Loading...

More Telugu News