Sensex: ఈరోజు కూడా భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses for second straight day

  • 456 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 152 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
  • టెలికాం మినహా అన్ని సూచీలది నష్టాల బాటే

రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 61,259కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 18,266కి దిగజారింది. ఈరోజు టెలికాం సూచీ మినహా ఇతర సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.35%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.56%), బజాజ్ ఫైనాన్స్ (0.46%), యాక్సిస్ బ్యాంక్ (0.44%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.97%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.63%), ఎన్టీపీసీ (-2.27%), ఎల్ అండ్ టీ (-2.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.12%).

  • Loading...

More Telugu News