Aryan Khan: షారుఖ్ కుమారుడికి కోర్టులో మరోసారి నిరాశ!

Mumbai court rejects Aryan Khans bail plea

  • ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ముంబై కోర్టు
  • హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఆర్యన్ న్యాయవాదులు
  • ఈనెల 8 నుంచి జైల్లో ఉన్న ఆర్యన్

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు ఈరోజు మరోసారి తిరస్కరించింది. రేపటి వరకు ఆర్యన్ ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. దీంతో, షారుఖ్ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయింది.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 3న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు.

మరోవైపు ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది. మరోవైపు ఆర్యన్ స్నేహితులు అర్భాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆర్యన్ తరపు లాయర్లు ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Aryan Khan
Shahrukh Khan
Bollywood
Drugs
Bail
  • Loading...

More Telugu News