Bollywood: వర్థమాన నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్!... కోర్టుకు సమర్పించిన ఎన్సీబీ

Aryan Khan Drugs Chat with Upcoming Heroine

  • డ్రగ్స్ సరఫరాదారులతోనూ టచ్ లో ఉంటున్న ఆర్యన్   
  • ఇవాళ మధ్యాహ్నం ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారణ
  • గతవారం తీర్పును రిజర్వ్ చేసిన స్పెషల్ కోర్టు

ముంబై క్రూయిజ్ పార్టీ సందర్భంగా ఓ వర్థమాన నటితో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో.. ఆ చాటింగ్ తాలూకు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజే ఆ నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి మెసేజ్ ల ద్వారా మాట్లాడినట్టు అధికారులు తేల్చారు. ఆ నటి త్వరలోనే బాలీవుడ్ సినిమాలో పరిచయం కానుందని సమాచారం.

అంతేగాకుండా కొందరు డ్రగ్స్ సరఫరాదారులతోనూ ఆర్యన్ ఖాన్ చాట్ చేసిన మెసేజ్ లనూ ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. వారితో ఆర్యన్ ఖాన్ తరచూ టచ్ లో ఉంటున్నాడని తెలిపారు. ముంబైలోని స్పెషల్ కోర్టు ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను విచారిస్తోంది. గత వారం వాదనలను విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మరో ఆరుగురు ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. ఆ జైలులోనే నిందితులందరికీ కౌన్సిలింగ్ చేశారు.

Bollywood
Drugs
Aryan Khan
Shahrukh Khan
Mumbai Cruise
NCB
  • Loading...

More Telugu News