stalin: ఆరో త‌ర‌గ‌తి బాలిక‌కు ఫోన్ చేసిన సీఎం స్టాలిన్.. న‌మ్మ‌లేక‌పోయానంటూ బాలిక హ‌ర్షం

stalin calls school girl

  • పాఠ‌శాల‌లు ఎప్పుడు తెరుస్తార‌ని స్టాలిన్‌కు బాలిక లేఖ‌
  • స్పందించి స్వ‌యంగా ఫోన్ చేసి చెప్పిన స్టాలిన్
  • న‌వంబ‌రు 1 నుంచి ప్రారంభిస్తామ‌ని వివ‌ర‌ణ‌

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు ఆరోతరగతి విద్యార్థిని ప్రజ్ఞ ఓ లేఖ రాసింది. తాను తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులోని టైటన్ టౌన్‌షిప్‌కు చెందిన విద్యార్థినని, త‌మ‌ పాఠశాలను మ‌ళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాల‌ని ఆమె కోరింది. అందులో త‌న ఫోన్ నంబ‌రు కూడా ఇచ్చింది.

ఆ లేఖ‌ను చ‌దివిన‌ స్టాలిన్ వెంటనే స్పందించి ప్రజ్ఞకు ఫోన్ చేసి మాట్లాడి, ఆమెను థ్రిల్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా నవంబరు 1 నుంచి పాఠశాలలను తెరుస్తామ‌ని చెప్పారు. కరోనా గురించి చింతించాల్సిన అవ‌సరం లేద‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ, టీచరు చేసే సూచనలు పాటిస్తూ పాఠ‌శాల‌ల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని తెలిపారు.

సీఎం త‌న‌కు ఫోన్ చేయ‌డం ప‌ట్ల ప్ర‌జ్ఞ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. పాఠశాల ఎప్పుడు తెరుస్తున్నారో చెప్పాల‌ని తాను లేఖ రాయగా.. ముఖ్యమంత్రి స్వయంగా తనకు ఫోన్ చేయ‌డం నమ్మలేకపోయానని తెలిపింది.

  • Loading...

More Telugu News