: గుండె భద్రంగా ఉంటే...


మన గుండె భద్రంగా ఉంటే చాలు మన మూత్ర పిండాలు కూడా భద్రంగానే ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఆరోగ్యవంతంగా ఉండే గుండె మన మూత్రపిండాలను కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఒక పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ అనే సైన్సు పత్రిక ప్రచురించింది. మూత్రపిండాల అనారోగ్యంతో బాధపడేవారికి వారి గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవాల్సిందిగా సలహాలివ్వాలని, అందుకు అనువైన చికిత్సలను కూడా చేయించుకునేలా వారికి చెప్పాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మూత్రపిండాలు బలహీనంగా ఉంటే వారి గుండె ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశాలున్నాయట. ఈ విషయాలను గమనించేందుకు బర్మింగ్‌హామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామాకు చెందిన శాస్త్రవేత్త పాల్‌ ముంట్‌నర్‌ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్స్‌ ప్రచురించిన లైఫ్‌ సింపుల్‌ 7 అనే అంశాన్ని ఉపయోగించారు. ఇవి పొగతాగకుండా ఉండడం, శారీరకంగా ఉల్లాసంగా ఉండడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించే ఆహారం తీసుకోవడం, సరయిన బరువు ఉండడం, బ్లడ్‌ షుగర్‌ తక్కువగా ఉండేలా చూసుకోవడం, బిపి లేకుండా ఉండడం, ఇంకా కొలెస్టరాల్‌ లెవెల్స్‌ సరిగా ఉండేలా చూసుకోవడం. ఈ అంశాలను పాటించడం వల్ల హార్ట్‌అటాక్‌ సమస్య రాదని, అయితే వీటిలో ఏదైనా సరిగా లేకుండా గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతోబాటు అటు మూత్రపిండాలకు సంబంధించి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆయన హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News