Balakrishna: 'అన్ స్టాపబుల్' కాన్సెప్ట్ నచ్చడం వల్లనే ఒప్పుకున్నాను: బాలకృష్ణ 

Balakrishna said about Unstoppable show

  • 'ఆహా' వేదికగా 'అన్ స్టాపబుల్'
  • వ్యాఖ్యాతగా బాలకృష్ణ
  • ఈ రోజు జరిగిన కర్టెన్ రైజర్
  • నవంబర్ 4 నుంచి షో మొదలు  

తెలుగు ఓటీటీ మాధ్యమంగా 'ఆహా' తనదైన ప్రత్యేకతను చాటుతూ దూసుకుపోతోంది. ఒక వైపున సినిమాలు .. మరో వైపున వెబ్ సిరీస్ లు .. ఇంకో వైపున సరికొత్త కాన్సెప్టులతో కార్యక్రమాలను తీర్చిదిద్దుతున్నారు. అలా 'ఆహా'లో ఒక సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది.. ఆ కార్యక్రమం పేరే 'అన్ స్టాపబుల్'. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలవనుండగా, దానికి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈ రోజున జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ .. "ప్రతి మనిషి జీవితంలోను ఒక ప్రయాణం ఉంటుంది .. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్ స్టాపబుల్'. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది .. అందుకే చేయడానికి ఒప్పుకున్నాను.

ఇకపై .. ఈ వేదికపై .. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో మాట్లాడతాను .. వాళ్ల భావోద్వేగాలను పంచుకుంటాను .. కలుద్దాం .. 'ఆహా'లో 'అన్ స్టాపబుల్' అన్నారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "బాలకృష్ణ గారితో ఒక షో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టింది. తెలుగు సినిమా గౌరవాన్ని కాపాడుతూనే 'ఆహా' ఎదుగుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News