PVK Naidu Complex: గుంటూరులో రూ.130 కోట్లతో నాయుడు కాంప్లెక్స్... మంత్రి బొత్స ఆమోదం

Huge commercial market complex in Guntur

  • గుంటూరులో భారీ వాణిజ్య సముదాయం
  • గతంలో పీవీకే మార్కెట్ ఉన్న స్థలంలోనే నూతన కాంప్లెక్స్
  • బొత్సకు ప్లాన్లను వివరించిన అధికారులు
  • సంతృప్తి వ్యక్తం చేసిన బొత్స

గుంటూరులో పీవీకే నాయుడు కాంప్లెక్స్ పేరిట భారీ వాణిజ్య సముదాయం నిర్మాణం జరుపుకోనుంది. గతంలో పీవీకే నాయుడు మార్కెట్ ఉన్న స్థలంలోనే ఈ నూతన కాంప్లెక్స్ ను కార్పొరేషన్ నిర్మించనుంది. ఈ కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ.130 కోట్లు. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలిపారు. గుంటూరులో పీవీకే నాయుడు మార్కెట్ ఎంతో ప్రసిద్ధికెక్కింది.

పీవీకే నాయుడు 1945లో గుంటూరు కార్పొరేషన్ కు 60 సెంట్ల భూమిని ఇవ్వగా, అందులో దుకాణాలు నిర్మించి వ్యాపారస్తులకు అద్దెకు ఇచ్చారు. ఈ భవనం శిథిలం కావడంతో ఆరేళ్ల కిందట అధికారులు కూలగొట్టారు. దాంతో ఇక్కడ నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి ఏపీ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ ప్రతినిధులు పీవీకే నాయుడు మార్కెట్ కాంప్లెక్స్ కు ప్లాన్లు రూపొందించారు.

11 శ్లాబులు, ఒక్కో ఫ్లోర్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉండేలా ప్లాన్ రూపొందించారు. ఇందులో వ్యాపారస్తులకు రెండు ఫ్లోర్లు, మిగతా ఫ్లోర్లను గుంటూరు కార్పొరేషన్ ఆఫీసు, ఇతర వాణిజ్య సంస్థలకు కేటాయించనున్నారు.

  • Loading...

More Telugu News